Friday, 29 January 2010

గురువారం

అమ్మల గన్నయయ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె
ద్దమ్మ సురారులమ్మ కడుపాలడివుచ్చిన యమ్మ దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ,మా
యమ్మ కృపాబ్ధి యిచ్చత మహత్వ కవిత్వపటుత్వ సంపదల్
-పోతానామత్యుడు
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేవి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరీ
-శ్రీశంకారాచార్య
-శ్రీచక్రం-
బిందుత్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వశ్రనాగదళ సమ్యుత షోడశారం
వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ
శ్రీచక్రమేత దుదితం పరదేవతాయాః

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment